AP & TELANGANA NEWS 20/10/2020
👉అమరావతి: *ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో మూతపడిన స్కూళ్ల రీ-ఓపెనింగ్‌కు ఏపీ విద్యాశాఖ ముహూర్తం ఫిక్స్ చేసింది. నవంబర్-02 నుంచి రాష్ట్రంలో స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. అది ఒక్క పూట మాత్రమే స్కూళ్లు ఉంటాయని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపకపొతే ఆన్‍లైన్ క్లాసులు నిర్వహించాలని.. పాఠశాలల వేళలపై పరిస్థితిని బట్టి డిసెంబర్‍లో నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ తెలిపారు. నవంబర్‍లోనే ఒంటిపూట బడులతో పాటు మధ్యాహ్న భోజన పథకం కూడా అమలవుతుందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.*
*రెండురోజులకు ఒకసారి తరగతులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. 1,3,5,7 తరగతుల విద్యార్థులకు ఒక రోజు మాత్రమే క్లాసులు జరగనున్నాయి. 2,4,6,8 తరగతులకు మరో రోజు క్లాసులు జరగనున్నాయి. విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే మూడ్రోజులకోసారి తరగతులు నిర్వహిస్తామని విద్యాశాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.*
👉హదరాబాద్: *రాష్ట్రంలో దసరా వరకు అన్నిపరీక్షలు వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం స్పష్టం చేశారు. అన్ని ప్రవేశ పరీక్షలతోపాటు యూజీ, పీజీ, ఇంజినీరింగ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ఓయూ పరిధిలో జరగాల్సిన పరీక్షలను యూనివర్సిటీ వర్గాలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా జేఎన్టీయూ, కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించాల్సిన ఎంబీఏ, డిగ్రీ సెమిస్టర్, బీఈడీ పరీక్షలు సైతం ఇటీవల వాయిదా పడ్డాయి.*
👉 *రాబోయే మూడు రోజుల్లో తెలంగాణతో పాటు ఏపీలోనూ అక్కడక్కడ భారీ వర్షాలు, పలు చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వివరించింది. రాష్ర్టానికి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.*
👉 *బాసరలోని ట్రిపుల్ ఐటీ (రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ టెక్నాలజీస్) 2020-21 ప్రవేశాల తొలి జాబితా విడుదలైంది. ఆర్‌జీకేయూటీ ఏఓ రాజేశ్వర్ మంగళవారం జాబితాను విడుదల చేశారు. 2020-21 విద్యా సంవత్సరానికి గాను తొలివిడతలో 1193 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు మొత్తం 40,158 దరఖాస్తులు వచ్చాయని రాజేశ్వర్ పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులకు నవంబర్ 3-7వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు.*
👉 *హైదరాబాద్‌లో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న నైజీరియన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థి వీసాపై హైదరాబాద్‌లో చదువుతున్న డానియల్.. డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు.*
*నిందితుడు లంగర్‌హౌస్‌లో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తుండగా పట్టుకున్నారు. 6 గ్రాముల కొకైన్, నగదు, పాస్ పోర్ట్ స్వాధీనం చేసుకున్న టాస్క్‌ఫోర్స్.. డానియల్ ను విచారణ కోసం లంగర్‌హౌస్ పోలీసులకు అప్పగించారు.*
👉హదరాబాద్: *తెలంగాణలో అమలు చేసిన ఆన్‌లైన్ ఆడిట్ విధానంపై కేంద్రం ప్రశంసలు కురిపించింది. తెలంగాణ అమలు చేసిన ఆడిట్ విధానాన్ని దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది వంద శాతం గ్రామపంచాయతీలలో ఆన్‌లైన్ ఆడిట్ నిర్వహించనున్నట్లు కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ జాయింట్ సెక్రటరి కేఎస్ సేథి వెల్లడించారు. దేశంలోనే తెలంగాణ లో 25 శాతం గ్రామపంచాయతీలలో ఆన్‌లైన్ ఆడిట్ పూర్తి చేశారని ప్రశంసించారు.*
👉ఢల్లీ: *మన భూభాగం నుండి చైనాను ఎప్పుడు తరమిస్తారో చెప్పాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ సాయంత్రం 6 గంటలకు ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగిచనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. డియర్ పీఎం, జాతినుద్దేశించి మీరు చేసే ప్రసంగంలో భారత భూభాగం నుంచి చైనాను ఎప్పుడు తరిమేస్తారో తేదీతో సహా ప్రజలకు చెప్పాల్సిందిగా ప్రశ్నించారు.*
👉 *తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఈ నెల 31 వరకు పొడిగించారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఉత్తర్వులు జారీ చేశారు.*
👉 *వరదలతో అతలాకుతలమైన తెలంగాణ రాష్ట్రా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2 కోట్ల విరాళాన్ని పశ్చిమ బెంగాల్ తరపున ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.*
👉గుంటూరు: *ఓ మహిళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆమె నుంచి గుర్తు తెలియని వ్యక్తులు 11 లక్షల రూపాయలను కొట్టేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలంలో ఒక మహిళకు లాటరీలో కారు వచ్చిందని బెంగాల్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. లాటరీలో కారు వచ్చిందని చెప్పి సదరు మహిళ వద్ద నుంచి నిందితులు పదకొండు లక్షల రూపాయిలు వసూలు చేశారు. మోసపోయానని తెలుసుకున్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కలకత్తాకు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.*
👉 *ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకున్నదిa.p